APNRT Logo
More Options
ABOUT
Overview Governing Body Executive Council President Our CEO Contact
Registrations
Coordinator Association Srinivasa Kalyanam
Insurance Quick Links
Download Insurance Bond Check Payment Status Download Brochure FAQs
NEWS & EVENTS
Latest News News Clipping Gallery Videos E-Magazine
SUPPORT
Passport History GOODWILL AMBASSADORS FAQs
APNRTS Menu
APNRT - ఓటరు నమోదు మరియు ప్రత్యేక సవరణ (SIR) సమాచార కేంద్రం
APNRT Society (APNRTS) Special Initiative

HURRY UP, SIR!

Get your name in the Voter List

ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) తరపున ప్రవాసాంధ్రులకు (APNRIs) విజ్ఞప్తి!

APNRI లకు ముఖ్యమైన సమాచారం (Special Intensive Revision)

ప్రవాసాంధ్రులారా, మీ ఓటు హక్కును కాపాడుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జూన్ 15 నుండి జూలై 14 వరకు "ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision - SIR)" నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, BLOలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు. 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు నమోదై ఉందో లేదో పరిశీలించి, సంబంధిత వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాలి. ఒకవేళ మీ పేరు జాబితాలో లేకపోతే, మీ తల్లిదండ్రుల ఓటరు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 2002 ఓటర్ల జాబితాలో మీ వివరాలను తెలుసుకోవడానికి, ECI వెబ్‌సైట్‌లోని "Search Your Name in Last SIR"ను క్లిక్ చేసి, మీ ఓటరు వివరాలను తెలుసుకుని వాటిని ఎన్యూమరేషన్ ఫారంలో ఫిల్ చేయండి. మీరు విదేశాల్లో ఉన్నా ఆందోళన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులు మీ తరపున ఫారాన్ని పూర్తి చేయవచ్చు. లేదా మీరు స్వయంగా ఆన్‌లైన్‌లో ఫారాన్ని పూర్తి చేసి అప్‌లోడ్ చేయవచ్చు. చివరి తేదీలోపు నింపిన ఫారాన్ని BLOలకు అందజేయకపోతే, జూలై 21న విడుదలయ్యే తాత్కాలిక ఓటర్ల జాబితాలో మీ పేరు తొలగించే అవకాశం ఉంటుంది. మీ ఓటు హక్కును కాపాడుకోవడం మీ బాధ్యత. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు మీకు తెలిసిన ప్రవాసాంధ్రులతో షేర్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్

Special Intensive Revision (SIR) Timeline
జూన్ 15 - జూలై 14
ఇంటింటికి సర్వే

బూత్ స్థాయి అధికారులు (BLO) మీ ఇంటి వద్దకే వచ్చి ప్రతి ఓటరు సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు.

జూలై 14 నాటికి
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్

పోలింగ్ కేంద్రాల విభజన, మార్పులు మరియు చేర్పుల ప్రక్రియను పూర్తి చేయడం.

జూలై 21
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ప్రాథమిక ముసాయిదా (Draft Electoral Roll) ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచబడుతుంది.

జూలై 21 - ఆగష్టు 20
అభ్యంతరాలు & క్లెయిమ్ ల స్వీకరణ

జాబితాలో సవరణలు కోరడానికి లేదా అభ్యంతరాలను నమోదు చేయడానికి దరఖాస్తులు స్వీకరించబడును.

జూలై 21 - సెప్టెంబర్ 18
క్లెయిమ్ ల పరిష్కార ప్రక్రియ

స్వీకరించిన అన్ని క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల పై అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు.

సెప్టెంబర్ 22
తుది ఓటర్ల జాబితా విడుదల!

అన్ని సవరణలతో కూడిన తుది ఓటరు జాబితా (Final Electoral Roll) అధికారికంగా ప్రచురించబడుతుంది.

ఓటరు నమోదు ప్రక్రియ

దిగువ పట్టికను అనుసరించి మీ ఓటర్ జాబితా స్థితి మరియు డాక్యుమెంట్లను సులభంగా నిర్ధారించుకోండి.

START: Visit voters.eci.gov.in
Sign up and login with mobile number
1
2002 లో మీ పేరు ఓటర్ జాబితాలో ఉందా?

Is your name in 2002 list?

2
2002 లో మీ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయా?

Is parent's name in 2002?

3
ఇద్దరి పేర్లు 2002 ఓటర్ జాబితాలో లేవా?

Neither name in 2002?

YES (అవును) ప్రక్రియ / Steps:
  • 2002 జాబితా నుండి Part Number & Serial Number నోట్ చేసుకోండి.
  • ఆన్లైన్ లో మీ యొక్క మరియు మీ బంధువుల 2002 జాబితాలోని వివరాలను పూరించండి.
NO (లేదు) ప్రక్రియ / Steps:

జాబితాలో పేరు లేకపోతే, మీ పుట్టిన తేదీ ఆధారంగా డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.

పుట్టిన తేదీ ఆధారంగా కావాల్సిన డాక్యుమెంట్లు
1 జూలై 1987 కంటే ముందు

స్వయం ధృవీకరణ డాక్యుమెంట్ మాత్రమే సమర్పించాలి.

1 జూలై 1987 – 3 డిసెంబర్ 2004

మీ డాక్యుమెంట్ + ఒక పేరెంట్ డాక్యుమెంట్ సమర్పించాలి.

3 డిసెంబర్ 2004 తర్వాత

మీ డాక్యుమెంట్ + ఇద్దరి పేరెంట్స్ డాక్యుమెంట్స్ తప్పనిసరి.

స్వతంత్ర సమాచార గైడ్

ఓటరు నమోదు & సవరణల ఇంటరాక్టివ్ గైడ్

మీకు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడం లేదా ఇప్పటికే ఉన్న కార్డులో మార్పులు చేయడం వంటి సమాచారాన్ని ఇక్కడ సులభంగా తెలుసుకోవచ్చు.

మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

సరైన ఫారమ్‌ను మరియు సమాచారాన్ని సులభంగా కనుగొనడానికి క్రింది ఒక బటన్‌ను క్లిక్ చేయండి.

కొత్త ఓటరుగా నమోదు

ఫారమ్ 6A (Form 6A)

ఓటర్ల జాబితాలో మీ పేరు నమోదు చేసుకునే సమాచారం

ఒకవేళ మీ పేరు ఓటర్ల జాబితాలో నమోదు కాకపోతే, జూలై 14 తర్వాత ఫారమ్ 6A తో ముందుకు సాగండి.
తల్లిదండ్రుల పౌరసత్వం?

తల్లిదండ్రుల్లో ఎవరైనా భారతీయేతరులా?

🔴 ప్రత్యేక పరిస్థితి:

తల్లిదండ్రుల్లో ఎవరైనా భారతీయ పౌరులు కాకపోతే, వారి చెల్లుబాటయ్యే Passport & Visa ప్రతులు కూడా తప్పనిసరిగా సమర్పించాలి.

అవసరమైన పత్రాల జాబితా:
0 / 3 సిద్ధం

1. ఇటీవలి పాస్పోర్ట్ సైజు రంగుల ఫోటో

(One Recent Passport Size Photograph)

2. భారతీయ పాస్పోర్ట్ ప్రతులు

(Valid Indian Passport Copies)

3. చెల్లుబాటు అయ్యే వీసా ప్రతి

(Valid Visa Endorsement)
ముఖ్యమైన సూచనలు:
• స్వీయ ధృవీకరణ (Self-Attestation):

మీరు దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసినా లేదా పోస్ట్ ద్వారా పంపినా, పైన పేర్కొన్న పాస్పోర్ట్ మరియు వీసా జిరాక్స్ ప్రతులపై తప్పనిసరిగా మీ సంతకం (Self-Attested) చేయాలి.

• ఒరిజినల్ పాస్పోర్ట్ (In-Person Verification):

ఒకవేళ మీరు నేరుగా మీ నియోజకవర్గ ఈఆర్ఓ (ERO - Electoral Registration Officer) కార్యాలయానికి వెళ్లి దరఖాస్తును సమర్పిస్తే, ధృవీకరణ కోసం మీ ఒరిజినల్ పాస్పోర్ట్ను చూపించాల్సి ఉంటుంది.

• తల్లిదండ్రులు లేదా బంధువుల ద్వారా ధృవీకరణ (Relatives Verification):

ఒకవేళ మీరు దరఖాస్తును ఆన్‌లైన్ లేదా పోస్ట్ ద్వారా సమర్పిస్తే, ఈఆర్ఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. బూత్ స్థాయి అధికారి (BLO) మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ తల్లిదండ్రులు (Parents) లేదా బంధువులు (Relatives) మీ స్వయం-ధృవీకరించిన ప్రతులను సరిచూసి, వారి డిక్లరేషన్ (Declaration) ద్వారా సులభంగా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.

కార్డు బదిలీ & సవరణలు

ఫారమ్ 8 (Form 8)

ఓటరు కార్డు ఉన్నవారు ఉపయోగించే బహుళ ప్రయోజన సేవలు

ఫారమ్ 8 ను ముఖ్యంగా క్రింది అవసరాల కోసం ఉపయోగిస్తారు:

డెమో ఓటరు కార్డు (సవరించే వివరాలపై క్లిక్ చేయండి):
EPIC CARD DEMO భారత ఎన్నికల సంఘం
ఫోటో
పేరు: రాముడు
పుట్టిన తేదీ: 15/08/1995
లింగం: పురుషుడు
తండ్రి/భర్త పేరు: దశరథుడు
1. నివాస స్థల మార్పు (Shifting of Residence):

మీరు మీ ప్రస్తుత స్థలాన్ని ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరొక దానికి లేదా ఒకే నియోజకవర్గంలో ఒక ప్రాంతం నుండి మరొక దానికి మార్చినప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

2. ప్రస్తుతం ఉన్న ఓటరు వివరాల సవరణ (Correction of Entries in Existing Electoral Roll):

మీ ఓటరు కార్డు లోపల ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకోవచ్చు. సవరణ ఫీల్డులు:

మీ పేరు పుట్టిన తేదీ/వయస్సు లింగం (Gender) తండ్రి/భర్త పేరు ఫోటో మొబైల్ నంబర్
3. కొత్త ఓటరు గుర్తింపు కార్డు జారీ (Replacement of EPIC):

మీ ఓటరు కార్డు పోయినా, పాడైపోయినా లేదా తీవ్రంగా చిరిగిపోయినా ఎటువంటి మార్పులు లేకుండా అదే వివరాలతో కొత్త ప్లాస్టిక్ EPIC కార్డ్‌ పొందవచ్చు.

4. దివ్యాంగులుగా గుర్తించడం (Marking of Person with Disability):

పోలింగ్ రోజున ప్రత్యేక సదుపాయాలు మరియు వీల్‌చైర్ సహాయాన్ని సులభంగా పొందడానికి మీ ఓటుకు దివ్యాంగుల గుర్తింపును మార్క్ చేయవచ్చు.

Official ECI Document List

ECI ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియకు అవసరమైన 11 పత్రాలు

ఓటరు తన అర్హతను నిరూపించడానికి ఎన్యూమరేషన్ ఫారంతో పాటు క్రింది 11 పత్రాలలో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు:

నా వద్ద ఉన్నవి: 0 / 11
పత్రాల సన్నద్ధత ట్రాకర్ (Documents Checklist Tracker)

సవరణ ప్రక్రియకు మీ వద్ద అందుబాటులో ఉన్న ధ్రువీకరణ పత్రాలను క్లిక్ చేసి గుర్తించుకోండి.

Progress 0% Complete
Doc 01
1. జనన ధృవీకరణ పత్రం

Birth Certificate

వయస్సు మరియు పుట్టిన తేదీకి అత్యంత నమ్మకమైన ప్రాథమిక ఆధారం.

Doc 02
2. భారతీయ పాస్‌పోర్ట్

Indian Passport

మీ పౌరసత్వం మరియు శాశ్వత అడ్రస్ రెండింటిని ఏకకాలంలో నిరూపిస్తుంది.

Doc 03
3. 10వ తరగతి / మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్

10th Class / Matriculation Certificate

విద్యాబోర్డ్ చే ధృవీకరించబడిన అధికారిక పుట్టిన తేదీ పత్రం.

Doc 04
4. శాశ్వత నివాస ధృవీకరణ పత్రం

Permanent Residence Certificate

మీరు సంబంధిత నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్నారని నిరూపించే పత్రం.

Doc 05
5. అటవీ హక్కుల ధృవీకరణ పత్రం

Forest Rights Certificate

గిరిజన లేదా సాంప్రదాయ అటవీ నివాసుల నివాస అర్హతకు ప్రత్యేక పత్రం.

Doc 06
6. కుల ధృవీకరణ పత్రం

SC/ST/OBC Caste Certificate

రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అధికారి జారీ చేసిన అధికారిక కుల పత్రం.

Doc 07
7. జాతీయ పౌరుల నమోదు పత్రం (NRC)

National Register of Citizens

వర్తించే సరిహద్దు లేదా శరణార్థి ప్రాంతాల్లో పౌరసత్వ రుజువుకు ఉపయోగించబడుతుంది.

Doc 08
8. కుటుంబ రిజిస్టర్

Family Register (Local Bodies)

స్థానిక పురపాలక సంఘం లేదా గ్రామ పంచాయతీ పర్యవేక్షించే అధికారిక జాబితా.

Doc 09
9. గృహ లేదా భూమి కేటాయింపు పత్రం

Land/House Allotment Certificate

ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్స్ లేదా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన పట్టా కాపీ.

Doc 10
10. ప్రభుత్వ ఉద్యోగి ఐడీ / పెన్షన్ ఆర్డర్

Service ID Card / Pension Order (PPO)

కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు లేదా PSUలు జారీ చేసిన అధికారిక సేవా పత్రం.

Doc 11
11. ఇతర గుర్తింపు పొందిన ప్రభుత్వ పత్రాలు

Other Approved Government Documents

జనన తేదీ, జనన స్థలం లేదా భారత పౌరసత్వ అర్హతను నిరూపించే మరేదైనా గెజిటెడ్ పత్రం.

మీ శోధనకు సరిపోయే పత్రం ఏదీ లేదు!

ఎన్నారైల కొరకు నిబంధనలు (Mandatory Rules)

గవర్నమెంట్ మరియు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వారి SOP మార్గదర్శకాల ప్రకారం, ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఈ నిబంధనలు పాటించాలి.

1. మొబైల్ నంబర్ లింకింగ్ తప్పనిసరి (Form 8)

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమయంలో ఎన్నారైలు ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫారాన్ని పూరించాలి. అయితే, మీ ఓటర్ ఐడీ (EPIC) కి యాక్టివ్ మొబైల్ నంబర్ లింక్ చేయబడితేనే సిస్టమ్ మిమ్మల్ని లాగిన్ అవ్వడానికి అనుమతిస్తుంది. ఒకవేళ లింక్ కాకపోతే, వెంటనే 'Form 8' (ఫారమ్ 8) ద్వారా మీ నంబర్‌ను ECI పోర్టల్‌లో అప్‌డేట్ చేయండి.

2. పేరు మ్యాపింగ్ నిబంధన (Name Sync)

మీ ఓటర్ ఐడీ (EPIC 2025) లో ఉన్న పేరు మరియు ఆధార్ కార్డులో ఉన్న పేరు అక్షరం-అక్షరం ఖచ్చితంగా సరిపోలాలి. ఆన్‌లైన్ ఫారమ్ సమర్పణకు C-DAC e-Sign (హస్తాక్షర్) సర్వీస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది, ఇది ఆధార్ డేటాబేస్ ఆధారంగా పనిచేస్తుంది. పేరులో స్వల్ప తేడాలున్నా ధృవీకరణ విఫలమవుతుంది.

ఆధార్ మరియు ఓటర్ పేరు మ్యాపింగ్ (Aadhaar & Voter Name Match Test)

మీ ఆధార్ కార్డు మరియు ఓటర్ కార్డులోని పేర్లను టైప్ చేసి, డిజిటల్ సిగ్నేచర్ అప్రూవ్ అవుతుందో లేదో తెలుసుకోండి.

నమోదు చేయండి
అధికారిక Documents (View Documents)

ప్రత్యేక సవరణ (SIR) కొరకు ఈ క్రింది అధికారిక పీడీఎఫ్ మార్గదర్శకాలను పరిశీలించండి.

ECI ఆన్‌లైన్ SOP గైడ్(హ్యాండ్‌బుక్)

SOP Tutorial
పేజీ 1: పోర్టల్ లాగిన్ Pg 1
పేజీ 2: ఓటర్ సెర్చ్ & OTP Pg 2
పేజీ 3: కేటగిరీ ఎంపిక Pg 3
పేజీ 4: CDAC ఈ-సైన్ ప్రక్రియ Pg 4
పేజీ 5: ఫారమ్ ప్రివ్యూ Pg 5
పేజీ 6: డిక్లరేషన్ & సబ్మిట్ Pg 6
SOP పేజీ 1 voters.eci.gov.in

పోర్టల్ ప్రవేశం మరియు రాష్ట్ర ఎంపిక

ఓటరు స్వయంగా మాత్రమే ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయగలరు, ఎందుకంటే చివరలో ఆధార్ ఉపయోగించి ఈ-సైన్ (e-Sign) చేయాల్సి ఉంటుంది.

మీ ఆధార్‌లోని పేరు, ఓటరు కార్డులోని పేరుతో ఖచ్చితంగా మ్యాపింగ్ కాకపోతే, ఆన్‌లైన్ బదులు మీ BLO ద్వారా ఆఫ్‌లైన్ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
కీలక దశలు:
  1. ECI ఓటర్ సర్వీస్ పోర్టల్‌ను సందర్శించండి.
  2. "Fill Enumeration Form" పై క్లిక్ చేయండి.
  3. రాష్ట్రాన్ని ఎంచుకోండి (ఉదాహరణకు: Andhra Pradesh లేదా Telangana).
SOP పేజీ 2 Prefilled Info / Verification

EPIC తనిఖీ మరియు మొబైల్ OTP గేట్వే

మీ ఓటరు కార్డు (EPIC) నంబర్‌ను నమోదు చేసి సెర్చ్ క్లిక్ చేయగానే సిస్టమ్‌లోని మీ ప్రాథమిక వివరాలు ఆటోమేటిక్‌గా తెరపై కనిపిస్తాయి.

తెరపై కనిపించే వివరాలు: ఓటరు పేరు, EPIC నంబర్, సీరియల్ నంబర్, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ సమాచారం.

వివరాల దిగువన మొబైల్ నంబర్ అడుగుతుంది. లింక్ అయిన నంబర్ ఎంటర్ చేసి "Send OTP" క్లిక్ చేయండి. ఓటరు మొబైల్‌కు వచ్చే 6 అంకెల OTP ను నమోదు చేసి ధృవీకరించాలి. ఒకవేళ లింక్ కాకపోతే ముందే ఫారమ్ 8 ద్వారా లింక్ చేసుకోవాలి.

SOP పేజీ 3 Category Selection

గత SIR కేటగిరీ ఎంపిక మరియు సెర్చ్

గత ఇంటెన్సివ్ సవరణలో మీ పేరు లేదా మీ బంధువుల పేరు ఉందో లేదో నిర్ధారించడానికి ఈ క్రింది మూడింటిలో ఒక కేటగిరీని ఎంచుకోవాలి:

  • 🔹 My Name exists in Electoral Roll of Last SIR: గత SIR జాబితాలో నా పేరు ఉంది.
  • 🔹 My Parents Name exists in Electoral Roll of Last SIR: నా తల్లి/తండ్రి/తాత/అమ్మమ్మ పేరు ఉంది.
  • 🔹 Neither my name nor my parents name exists: మా ఎవరి పేరు కూడా అందులో లేదు.

కేటగిరీ ఎంచుకున్న తర్వాత 2002 అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ నంబర్ మరియు పార్ట్ సీరియల్ నంబర్ ఆధారంగా సెర్చ్ చేసి రికార్డును సిస్టమ్‌కు అనుసంధానించవచ్చు.

SOP పేజీ 4 C-DAC eSign Interface

C-DAC ఈ-సైన్ (e-Sign) ద్వారా ఆధార్ ధృవీకరణ

దరఖాస్తును తుది సబ్మిట్ చేయడానికి ముందు, వినియోగదారులు ECI వెబ్‌సైట్ నుండి కేంద్ర ప్రభుత్వ జాతీయ e-Sign సేవ (HastasKshar) పేజీకి మళ్ళించబడతారు.

సురక్షిత ప్రమాణీకరణ దశలు:
  1. 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  2. "Aadhaar OTP" రేడియో బటన్‌ను ఎంచుకోండి.
  3. "Get OTP" పై క్లిక్ చేయండి. మీ ఆధార్‌కు అనుసంధానించబడిన ఫోన్‌కు వచ్చే OTP తో ప్రాసెస్ కంప్లీట్ చేయండి.
SOP పేజీ 5 Form Preview

ఎన్యుమరేషన్ దరఖాస్తు ప్రివ్యూ షీట్

ఆధార్ ధృవీకరణ విజయవంతమైన తర్వాత, మీరు పూరించిన వివరాలన్నీ ఒక అధికారిక దరఖాస్తు ఫారమ్ రూపంలో తెరపై కనిపిస్తాయి.

ప్రివ్యూలో కనిపించే సమాచారం: ఓటరు పూర్తి పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుత విదేశీ లేదా స్థానిక చిరునామా, తల్లిదండ్రుల వివరాలు మరియు గతంలో 2002 సవరణకు సంబంధించిన సంబంధిత రిలేటివ్ వివరాలు.
SOP పేజీ 6 Declaration / Submission

చట్టబద్ధమైన డిక్లరేషన్ మరియు తుది సమర్పణ

దరఖాస్తు ప్రక్రియ ముగింపులో, ఓటరు చట్టపరమైన నిబంధనలను అంగీకరిస్తూ డిక్లరేషన్ బాక్స్‌లను ఎంచుకోవాలి.

⚠️ "నేను ఏ ఇతర దేశ పౌరసత్వం కలిగి లేను. పైన ఇచ్చిన వివరాలన్నీ నా పరిజ్ఞానం మేరకు నిజమని ప్రమాణం చేస్తున్నాను. తప్పుడు వివరాలు సమర్పించడం శిక్షార్హమైన నేరం."

డిక్లరేషన్ చెక్‌బాక్స్‌ను టిక్ చేసి, చివరగా "Submit" బటన్ నొక్కడం ద్వారా మీ దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా విజయవంతంగా నమోదు చేయబడుతుంది.

మీ ఓటర్ అర్హత & పత్రాల స్వయం తనిఖీ సాధనం

మీకు కావలసిన ఖచ్చితమైన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడానికి ఈ క్రింది రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. మా ఇంటరాక్టివ్ వ్యవస్థ మీకు తగిన మార్గదర్శకాన్ని అందిస్తుంది.

మీరు అనుసరించాల్సిన విధానం

APNRTS ప్రత్యేక సహాయ కేంద్రం (Special Cell)

విదేశాలలో మరియు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు తమ ఓటర్ నమోదు ప్రక్రియలో ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికై మరియు ఎలాంటి సందేహాల నివృత్తికైనా APNRT ని సంప్రదించవచ్చు.

APNRTS Helpline / హెల్ప్‌లైన్ నంబర్ +91 8500027678 / +91 8500127678 / +91 8500227678
Email Support / ఈమెయిల్ సహాయం helpline@apnrts.com
Official Website / వెబ్‌సైట్ apnrts.ap.gov.in
📢

ముఖ్యమైన సూచనలు!

  • అన్ని దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారానే: ఓటరు నమోదు మరియు ఏవైనా మార్పుల కొరకు ECI పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించండి.
  • సకాలంలో స్పందించండి: అభ్యంతరాల గడువు (జులై 21 నుండి ఆగష్టు 20) లోపల సమాచారాన్ని నమోదు చేయండి.
  • ఎన్నారైల ప్రత్యేక నమోదు: విదేశాలలో ఉన్న భారతీయులు 'ఫారమ్ 6A' (Form 6A) ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
  • సందేహాల కోసం సేవలు: మీ BLO మరియు పోలింగ్ స్టేషన్ వివరాల కోసం ఉచిత హెల్ప్ లైన్ 1950 కి సంప్రదించండి.
💬
APNRTS Assistant